ఒక పక్క అల్లర్లతో అమెరికా మొత్తం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నా సరే ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వైఖరి లో మాత్రం ఏ విధంగా చూసినా సరే మార్పు రావడం లేదు. తాజాగా నిరసనకారులను రెచ్చగొట్టే విధంగా అతను వ్యాఖ్యలు చేసాడు. తాను ‘‘లా అండ్ ఆర్డర్’’ అధ్యక్షుడిననీ అల్లర్లలను అణచి వేసేందుకు దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లోనూ అమెరికా సైన్యాన్ని మోహరిస్తా అని హెచ్చరించారు. 

 

ఆయన నుంచి అలా ప్రకటన వచ్చిందో లేదో... అమెరికా మిలటరీ వాహనాలు పెద్ద ఎత్తున వైట్‌హౌస్ సమీపంలోని పెన్సిల్వేనియా ఎవెన్యూకు వచ్చేసాయి. లాఫాయెట్ పార్క్ వద్ద మిలటరీ పోలీసులు, అధికారులు ఆందోళనకారులపై లాఠీ చార్జ్ కూడా చేసారు. ఇక గవర్నర్ల పై కూడా ఆయన తీవ్ర విమర్శలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: