లాక్ డౌన్ సడలింపుల విషయంలో కర్ణాటక ప్రభుత్వం కాస్త ముందు నుంచి కూడా సడలింపు లు ఎక్కువగా ఇస్తుంది. కరోనా ప్రభావం లేని ప్రాంతాల్లో ఎక్కువగా అక్కడి ప్రభుత్వం సడలింపులు ఇస్తూ వస్తుంది. ప్రస్తుతం అక్కడ కేసులు ఉన్నా సరే కేవలం కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరమితం అవుతున్నాయి. ఈ నేపధ్యంలోనే సడలింపులు ఎక్కువగా ఇస్తుంది కర్ణాటక ప్రభుత్వం. 

 

తాజాగా కర్ణాటక సర్కార్ మరో అనుమతి ఇచ్చింది. మైక్రో బెవరేజేస్ కి అక్కడ అనుమతులు ఇచ్చింది. ఇందుకోసం సమయాన్ని కూడా నిర్దేశించింది అక్కడి ప్రభుత్వం. జూన్ 30 వరకు గాజు, సిరామిక్ లేదా స్టెయిన్లెస్ స్టీల్ కంటైనర్ (2 లీటర్ల వరకు) తయారీ / ఉత్పత్తి మరియు బీర్ల అమ్మకం కోసం మైక్రో బెవరేజేస్ కి అనుమతి ఇచ్చింది. ఉదయం 9 నుంచి సాయంత్రం 9 వరకు తెరిచి ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: