ప్రపంచంలో కరోనా వైరస్ ఎప్పటి నుంచి మొదలైందో అప్పటి నుంచి ఎక్కువ ప్రభావితం అయ్యింది అమెరికా, ఇటలీ,ఫ్రాన్స్ లాంటి దేశాలతర్వాత ఇప్పుడు రష్యా లో కూడా మరణాలు, కేసులు పెరిగిపోతున్నాయి.  దాయాది దేశం అయిన పాకిస్థాన్ లో కూడా కరోనా కేసులు నానాటికీ పెరిగిపోతున్నాయి.  ఆ దేశంలో ఇప్పటికే మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 76,106కు చేరింది. మరణాలు 1599కి చేరాయి. అత్యధికంగా సింధ్ రాష్ట్రంలో 31086 కేసులు నమోదయ్యాయి. పంజాబ్ 26,240, గిల్గిత్ బాల్టిస్థాన్ 738, ఖైబర్ పక్తుంక్వా 10485, బలూచిస్థాన్ 4393 ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఇక పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్లో ఇప్పటి వరకు 2893 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

 

ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారి జనాన్ని ముప్పుతిప్పలు పెడుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఏదో రూపంలో అంటుకుంటోంది. పాకిస్థాన్లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది.  పాకిస్థాన్ లో నమోదైన మొత్తం కేసుల్లో 28.5 శాతం మహిళలు ఉన్నారని పాకిస్థాన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం కేసులలో 1148 మంది 14 ఏండ్ల లోపు పిల్లలు ఉన్నారని తెలిపింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: