ఏపీలో సుమారు 61 రోజుల తర్వాత నేటి నుంచి విశాఖ హార్బ‌ర్‌లో చేప‌ల వేట ప్రారంభ‌మ‌వుతోంది. ఈ మేర‌కు మ‌త్స్య‌కారులు  సిద్ధమవుతున్నారు. నిజానికి ఈ నెల 1న వేటకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కొన్ని పరిస్థితుల వల్ల ఈ నెల 2న అర్ధరాత్రి నుంచి వేటకు బయలుదేరేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు మ‌త్స్య‌కారులు. చేపల రేవు కేంద్రంగా నిత్యం 678 పడవలు, 2,996 మరపడవలు, సంప్రదాయ పడవలు 742, 1100 తెప్పలు నిత్యం చేపలు, రొయ్యల వేట సాగిస్తుంటాయి.

 

అయితే.. తొలి రోజు 150 వరకూ బోట్లు వేటకు వెళ్లే అవకాశం ఉందని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. హార్బ‌ర్ జెట్టీల వ‌ద్ద ఐగుగురికి మాత్ర‌మే అనుమ‌తి ఇచ్చారు. హార్బ‌ర్‌లోకి వాహ‌నాల రాక‌పోక‌ల‌కు అనుమ‌తి లేదు. క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో మ‌త్స్య‌కారులు అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని అదికారులు సూచిస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: