ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ కార్యక్రమాలు ఎంత దూకుడుతో అమలు చేస్తున్నారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా సరే ఇప్పుడు ఏపీ సర్కార్ నిధుల విడుదల విషయంలో ఏ మాత్రం కూడా అలసత్వం ప్రదర్శించడం లేదు. ఎవరికి అన్యాయం చేయవద్దు అనే ఉద్దేశం తో ఏపీ సర్కార్ ఇప్పుడు అడుగులు వేస్తుంది అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. 

 

అయితే తాజాగా గత మూడు నెలలుగా ఆగిపోయిన నిధులను చెల్లించాలి అంటూ బ్రాహ్మణ కార్పోరేషన్ డిమాండ్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ నుండి గత మూడు నెలలు వృద్ధాప్య పింఛన్లు మరియు 'భారతీ' స్కీమ్ ద్వారా పిల్లలకు స్కాలర్ షిపులు త్వరితగతిన విడుదల చేయాలని విన్నవించుకుంటున్నామని సిఎం వైఎస్ జగన్ కి విజ్ఞప్తి చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: