ముంబై ని తుఫాన్ వణికిస్తుంది. అక్కడ తుఫాన్ వేగంగా దూసుకువస్తుంది. గంట గంటకు దాని తీవ్రత పెరుగుతుంది గాని తగ్గడం లేదు. దీనితో పశ్చిమ తీరం మొత్తం కూడా షేక్ అవుతుంది. ఇక ఇది ఇలా ఉంటే ముంబై మరియు దాని శివారు ప్రాంతాలలో మంగళవారం రాత్రి మరియు ఈ రోజు ఉదయం తేలికపాటి జల్లులు కురిసాయి. 

 

ఈ మధ్యాహ్నం మహారాష్ట్ర రాజధాని నగరానికి దక్షిణాన 10 నాటికల్ మైళ్ళు (16 కి.మీ) దూరంలో రాయ్‌గడ్ జిల్లా అలీబాగ్ సమీపంలో తుఫాన్ తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. మంగళవారం రాత్రి 8.30 నుండి బుధవారం ఉదయం 5.30 గంటల మధ్య శివారు ప్రాంతాల్లో 10 మి.మీ వర్షం నమోదైందని వాతావరణ శాఖ చెప్పింది. దక్షిణ ముంబైలో 14.4 మి.మీ నమోదైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: