ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారితో ప్రజలు కష్టాలు పడుతున్న విషయం తెలిసిందే. బయటకు రావాలంటే ఎన్నో ఆంక్షలు.. ఇబ్బందులు పడుతున్నారు. ఒకవేళ రావాలన్నా సోషల్ డిస్టెన్స్, మాస్క్, శానిటైజర్ తప్పని సరి అంటున్నారు. ప్రస్తుతం 5.0 లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.  అయితే గత రెండు నెలల నుంచి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా పెద్దగా క్రేమ్ రేట్ పెరగలేదు అంటున్నారు పోలీసులు. కానీ నేరస్తులు అక్కడక్కడా రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ఇంటికి, సచివాలయానికి బాంబు బెదిరింపు వచ్చింది. దాంతో అలర్ట్ అయిన  సెక్యూరిటీ సిబ్బంది..  పోలీసులు, అధికారులు తర్జన భర్జన అయ్యారు.

 

తరువాత ఓ ఆకతాయి కుర్రాడు కావాలని ఫోన్ చేసి బాంబు ఉందని బెదిరించాడని తెలిసి శాంతించారు. ఈ బాంబు బెదిరింపుతో సీఎం ఇంటికి, సచివాలయానికి భద్రతను పెంచారు. ప్రవేశ మార్గంలో మెటల్‌ డిటెక్టర్లను ఏర్పాటు చేశారు. అపరిచితులపై నిఘా పెంచారు. చెన్నై గ్రీవెన్స్‌ రోడ్డులో సీఎం పళనిస్వామి నివాసం, మెరీనా తీరంలోని కామరాజర్‌ సాలైలో సచివాలయనికి ఈ బాంబు బెదిరింపు వచ్చింది. సచివాలయం పరిసరాల్లో తనిఖీలు చేపట్టారు. బాంబ్, డాగ్‌స్కావడ్‌లు రంగంలోకి దిగాయి. ప్రస్తుతం పోలీసులు బాంబు కాల్ చేసిన యువకుడి కోసం గాలిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: