దేశంలో విజృంభిస్తున్న కరోనా వైరస్ తో ముందుండి వైద్య సిబ్బంది, పోలీసులు, మున్సిపల్ సిబ్బంది పోరాడుతున్నారు. ప్రభుత్వాలు, ప్రముఖులు వీరిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కానీ కరోనా యోధులు వైరస్ భారీన పడి మృతి చెందితే వారిని ఎవరూ పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలో మరణించిన అంబులెన్స్‌ డ్రైవర్‌ అంత్యక్రియలకు డబ్బులు లేకపోవడంతో ఆయన భార్య తాళిని అమ్మి అంత్యక్రియలను నిర్వహించింది. 
 
కర్ణాటకలోని . గదగ్‌ జిల్లా కొన్నూర్‌కు చెందిన అంబులెన్స్‌ డ్రైవర్‌ ఉమేష్‌ హదగలి గత రెండు నెలలుగా ఆస్పత్రి విధుల్లో అవిశ్రాంతంగా పని చేస్తూ గుండెపోటుతో మృతి చెందాడు. భర్త అంత్యక్రియలకు డబ్బులు లేకపోవడంతో ఆయన భార్య జ్యోతి తాళి తాకట్టు పెట్టింది. ఇద్దరు పిల్లలు కలిగిన ఆమెకు ఎటువంటి సాయం అందకపోవడంతో సోషల్ మీడియా ద్వారా కష్టాలను చెప్పుకుంది. విషయం తెలిసిన యడ్యూరప్ప త్వరమే బీమా మొత్తాన్ని వచ్చేలా చూడటంతో పాటు పరిహారం అందచేస్తామని హామీ ఇచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: