ప్రపంచ దేశాలను కరోనా వైరస్ చిగురుటాకులా వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల్లో రెండో స్థానంలో ఉన్న లాటిన్‌ అమెరికా దేశం బ్రెజిల్‌ లో కరోనా మృతుల సంఖ్య 30,000 దాటింది. ఈ మేరకు ఆ దేశ అధికారుల నుంచి ప్రకటన వెలువడింది. బ్రెజిల్ లో గడచిన 24 గంటల్లో 28,936 కొత్త కేసులు నమోదు కాగా 1,262 మంది కరోనా భారీన పడి మృతి చెందారు. బ్రెజిల్ లో ఇప్పటివరకు 5,55,583 కరోనా కేసులు నమోదయ్యాయి. 
 
అధికారిక లెక్కల ప్రకారం బ్రెజిల్ లో 31,999 మంది ఇప్పటివరకు మృతి చెందగా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలు నమోదైన నాలుగో దేశంగా బ్రెజిల్ నిలిచింది. నిపుణులు కేసుల సంఖ్య, మరణాల సంఖ్య ప్రకటించిన లెక్కల కంటే అధికంగా ఉండవచ్చని చెబుతున్నారు. బ్రెజిల్‌లో అత్యధికంగా కరోనా పాజిటివ్‌ కేసులు కావ్‌పోలో నగరంలో, రియో డీ జెనీరో, సియెర్రాల్లో నమోదవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: