తెలంగాణ సీఎం కేసీఆర్ కాన్వాయ్ వాహనానికి ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధించారు. పలు ప్రాంతాల్లో కాన్వాయ్ నిబంధనలు ఉల్లంఘించటంతో చలాన్లు విధించినట్టు ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. సీఎం కేసీఆర్ కాన్వాయ్ హైదరాబాద్, సైబరాబాద్, సూర్యాపేటలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిందని... అతివేగం కారణంగా నాలుగు సార్లు ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధించామని చెబుతున్నారు.
పెండింగ్ చలాన్లు 4,140 రూపాయలు చెల్లించాల్సి ఉండగా తాజాగా సీఎంవో అధికారులు పెండింగ్ చలాన్లను చెల్లించినట్టు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో ట్రాఫిక్ పోలీసులు సీసీ కెమెరాల ద్వారా వాహనాలు నిబంధనలు పాటించి చలానాలు జారీ చేస్తున్నారు. సీఎం కేసీఆర్ కాన్వాయ్ వాహనానికి ట్రాఫిక్ చలాన్లు విధించడంపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.