బుల్లితెరపై యాంకర్ ప్రదీప్ కు ఒక మంచి గుర్తింపు ఉంది అనే విషయం తెలిసిందే. బుల్లితెర పైనే కాకుండా మరో వైపు వెండితెరపై కూడా చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ తన టాలెంట్ ని  ప్రూవ్ చేసుకుంటూ  వచ్చాడు ప్రదీప్.ఇక ఇప్పుడు ఏకంగా  హీరోగా మారిపోయిన విషయం తెలిసిందే . 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాలో హీరోగా నటిస్తునాడు  ప్రదీప్. 

 


 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమా కు సంబంధించి మ్యూజిక్ ఆల్బం కూడా విడుదలైంది.అయితే ఈ సినిమాలోని నీలి నీలి ఆకాశం అనే  పాట ఎంతో మంది సంగీత ప్రేమికులను అలరించిన విషయం తెలిసిందే. ఎన్నో రోజుల పాటు యూట్యూబ్ లో సంచలనం సృష్టించింది ఈ పాట. తాజాగా ఈ పాట ఏకంగా 150 మిలియన్  వ్యూస్ ను కూడా దాటేసింది. దీనికి సంబంధించి ప్రదీప్ మాచిరాజు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టాడు . ఈ పాటను ఇంతలా  ఆదరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అంటు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: