హైదరాబాద్ లో చిరుత కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. హైదరాబాద్ లో దానిని పట్టుకోవడానికి గగన్ పహాడ్ తో పాటుగా పలు ప్రాంతాల్లో అధికారులు తిరగని ప్రాంతం లేదు. ఆరు బోన్లు పలు చోట్ల వలలు, మేకలు, కుక్కలు ఇలా ఎన్నో జంతువులను దాని కోసం ఉంచారు. దానిని పట్టుకోవడానికి నిద్రాహారాలు మాని తిరుగుతున్నారు అధికారులు. 

 

గగన్ పహాడ్ లో ఏర్పాటు చేసిన కెమెరాల్లో అది కనడింది అని అధికారులు అంటున్నారు. కాని అది మాత్రం ఎక్కడా కూడా దొరకకుండా తిరుగుతూ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. 20 రోజుల క్రితం కనపడిన ఈ చిరుత ఇప్పుడు దొరకకపోతే పరిస్థితి ఏంటీ అనే ఆందోళన అధికారులలో కూడా వ్యక్తమవుతుంది. అది చాలా స్మార్ట్ అని అందుకే దొరకడం లేదు అని అధికారులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: