నిసార్గా తుఫాన్ దెబ్బకు ఇప్పుడు ముంబై తీరం తో పాటుగా గోవా తీర ప్రాంతాలు కూడా షేక్ అవుతున్నాయి. ఒక పక్క కరోనా వైరస్ తో ఇబ్బంది పడుతున్న ముంబై నగరంలో ఇప్పుడు తుఫాన్ చుక్కలు చూపిస్తుంది. దీనిలో భాగంగానే ముంబై విమానాశ్రయాన్ని మూసి వేసింది మహారాష్ట్ర ప్రభుత్వం. ముంబైలో ఇప్పటికే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించిన సంగతి తెలిసిందే. 

 

ఇక గోవా గుజరాత్ లోని తీర ప్రాంతాల్లో కూడా ఆందోళనకరంగా ఉంది పరిస్థితి. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఈ గాలుల తీవ్రత మరింతగా ఉండే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. అలీ బాగ్ వద్ద 90 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ తీరాన్ని తాకింది. ఇది తీరం దాటడానికి మూడు గంటలు పట్టే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: