తుఫాన్ దెబ్బకు మహారాష్ట్ర గోవా, గుజరాత్ రాష్ట్రాలు వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. తుఫాన్ తీవ్రత గంట గంటకు పెరుగుతుంది. దీనితో మహారాష్ట్ర తీర ప్రాంతాల్లో అధికార యంత్రాంగం హై అలెర్ట్ ప్రకటించింది. ప్రజలను సురక్షితంగా ఉండాలి అంటూ అక్కడి ప్రభుత్వం కూడా హెచ్చరించిన సంగతి తెలిసిందే. 

 

ఇక ఇదిలా ఉంటే తాజాగా భారత అటవీ శాఖ అధికారి మడ అడవుల గురించి ఒక ఆసక్తికర ట్వీట్ చేసారు. “మనం ఈ రోజు మరో సైక్లోన్ను ఎదుర్కొంటున్నామని... కాబట్టి నేను మీకు గుర్తు చేసేది ఏంటీ అంటే.. మడ అడవులు బఫర్‌గా పనిచేస్తాయని తుఫానుల ప్రభావాన్ని తగ్గిస్తుందని చెప్పారు. అవి విండ్ ఫోర్స్‌ని విచ్ఛిన్నం చేస్తాయని ఆయన పేర్కొన్నారు. తుఫాను సమయంలో మానవులకు హాబిటాట్‌ను అందిస్తాయన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: