మహారాష్ట్రలో తుఫాన్ తీవ్రత ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. తుఫాన్ ని ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగం సిద్దంగా ఉన్నా సరే అక్కడ తుఫాన్ మాత్రం తన పని తాను చేస్తుంది. తుఫాన్ తీవ్రత గంట గంటకు పెరుగుతుందని అధికారులు చెప్తున్నారు. ఇక ఈ సమయంలో బలమైన ఈదురు గాలులు కూడా వీస్తున్నాయి. 

 

వేలాది చిన్న చిన్న ఇల్లు గాలుల దెబ్బకు తీవ్రంగా దెబ్బ తిన్న పరిస్థితి ఉంది. ఇక ఈ గాలుల దెబ్బకు పెద్ద పెద్ద భవనాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. రాయగడ్ వద్ద ఒక భవనం పై కప్పు తుఫాన్ దెబ్బకు ఎగిరిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది. దీనిని జాతీయ మీడియా షేర్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: