వన్ నేషన్ వన్ మార్కెట్ కి కేంద్ర కేబినేట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేబినేట్ లో దీనిపై చర్చ జరగగా మంత్రులు అందరూ దీనిని ఆమోదించారు. దేశ వ్యాప్తంగా రైతులు ఎక్కడైనా సరే పంటను అమ్ముకోవడానికి గానూ కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే నిత్యావసర వస్తువుల సవరణ చట్టానికి కూడా కేంద్ర కేబినేట్ ఆమోదం తెలిపింది. 

 

పంట ఉత్పత్తులను మార్కెట్ కి తరలించడానికి గానూ సులభతరం చేసే విధంగా నిర్ణయం తీసుకుంది కేంద్ర కేబినేట్. ఆన్లైన్ లో వ్యాపార లైసెన్స్ లు జారీ చెయ్యాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది తక్షణమే అమలులోకి రానుందని కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమార్ మీడియా తో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: