తమిళనాడులో కరోనా కేసులు ఏ మాత్రం కూడా ఆగడం లేదు. రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి గాని ఎక్కడా కూడా తగ్గడం లేదు. వందల కేసుల నుంచి వెయ్యి దాటే వరకు వెళ్ళాయి కరోనా కేసులు. ఆ రాష్ట్రంలో ఎక్కడా కూడా కేసులు కంట్రోల్ అయ్యే అవకాశం మాత్రం కనపడటం లేదు అనే చెప్పవచ్చు. నేడు కూడా అక్కడ భారీగా కేసులు నమోదు అయ్యాయి అని వైద్య ఆరోగ్య శాఖ చెప్పింది. 

 

తమిళనాడులో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పుడు 25,872 గా ఉందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ రోజు 1286 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తమిళనాడు ఆరోగ్య శాఖ కాసేపటి క్రితం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: