కేరళలో కరోనా వ్యాప్తి ఏ మాత్రం కూడా ఆగే పరిస్థితి ఇప్పుడు కనపడటం లేదు. అక్కడ కట్టడి అయినట్టే అయిన కరోనా వైరస్ ఇప్పుడు అక్కడ వేగంగా విస్తరిస్తుంది. అక్కడ ప్రతీ రోజు కూడా 80 కేసులకు పైగా నమోదు అవుతున్నాయి అని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

 

ఈ రోజు రాష్ట్రంలో 82 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ చెప్పింది. వాటిలో 53 విదేశాల నుండి తిరిగి వచ్చిన వారివి అని చెప్పుకొచ్చింది. 19 ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారివి అని పేర్కొంది. ప్రస్తుతం, రాష్ట్రంలో 1494 కేసులు ఉన్నాయి, వీటిలో 632 యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: