భారత్ చైనా మధ్య ఉద్రిక్త వాతావరణం ఉన్న సంగతి తెలిసిందే. రెండు దేశాల మధ్య క్రమంగా పరిస్థితులు ఇప్పుడు ఆందోళనకరంగా మారుతున్నాయి. రెండు దేశాల ఆర్మీ ఇప్పుడు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునే దిశగా పరిస్థితులు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఇది పక్కన పెడితే తాజాగా చర్చలకు రెండు దేశాలు శ్రీకారం చుట్టాయి.

 

భారత్ - చైనా మధ్య నెలకొన్న సరిహద్దు వివాదంపై ఈ నెల 6న ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతాయని కేంద్ర ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. ఈ చర్చలకు మిలటరీ స్థాయిలో ఉన్న ఉన్నతాధికారుల మధ్యే చర్చలు జరుగుతాయని సరిహద్దుల్లోని చుసుల్ - మోల్దో ప్రాంతంలో ఇరు దేశాల మిలటరీ ఉన్నతాధికారులు చర్చలు జరుపుతారని అధికారులు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: