హైదరాబాద్ సిటీ పరిధిలోని ఉస్మానియా , గాంధీ , నిమ్స్ పరిధిలో దాదాపు గా 600 మంది ని క్వారంటైన్ కి  తరలించారు. ఈ మూడు హాస్పిటల్స్ హాస్పిటల్స్ పరిధి లో దాదాపు గా 34 మంది వైద్య విద్యార్థులకు కోవిడ్   సోకింది. అయితే అందులో దాదాపుగా హాస్టల్ విద్యార్థులే ఉండడంతో వారితోపాటు ఉన్న సహా వైద్య విద్యార్థులను క్వారంటైన్ కి తరలించారు.

 

ఉస్మానియా హాస్టల్ క్వారంటైన్ లో 280 మందిని , గాంధీ హాస్పిటల్  హాస్టల్ క్వారంటైన్ లో 250 మందిని, నిమ్స్ హాస్పిటల్ హాస్టల్ క్వారంటైన్ లో 95 మందిని ఉంచి కరోనా టెస్టులు చేస్తున్నారు. దాదాపుగా 600 మందిని క్వారంటైన్ చేసి వైద్యం అందిస్తున్నారు వైద్యులు. వైద్య విద్యార్థులకు కరోనా సోకడంతో తక్షణ చర్యలను వైద్య అధికారులు చేపట్టారు. ఇదిలా ఉండగా దీనికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు వైద్యులు.  

మరింత సమాచారం తెలుసుకోండి: