సాధారణంగా గ్యాంగ్ లను నడపడం అంటే చాలా ఖర్చు తో కూడుకున్న పని... గతంలో గ్యాంగ్ లు అంటే మాఫియా డాన్ లు లేకపోతే దొంగలు ఎక్కువగా నడిపేవారు. ఇక రాజకీయ నాయకులకు అనుచరులు అభిమానులు ఉంటారు... వాళ్లకు ఆదాయం ఉంటుంది కాబట్టి వారికి వచ్చిన ఇబ్బంది ఏదీ పెద్దగా లేదు అనే చెప్పవచ్చు. 

 

ఇక విజయవాడ గ్యాంగ్ వార్ లో పాల్గొన్న వారిలో గ్యాంగ్ లు ఉన్నాయి. రెండు గ్యాంగ్ లు ఈ గొడవలో పాల్గొన్నాయి. ఒక గ్యాంగ్ లో 12 మంది మరో గ్యాంగ్ లో 13 మంది ఉన్నారు. ఇప్పటికే అందరిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు వీరిని నడపడానికి గానూ గ్యాంగ్ లీడర్లు గా చెప్తున్నా తోట సందీప్, కేటిఎం పండు అనే వ్యక్తులకు డబ్బులు ఎక్కడివి వారి వెనుక ఎవరు ఉన్నారు అనే దాని మీద ఇప్పుడు పోలీసులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: