ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా వైద్యులను చాలా వరకు జాగ్రత్తగానే చూసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారిని దేవుళ్ళు గా భావిస్తున్నారు. వారు లేకపోతే కరోనా వైరస్ ని కట్టడి చేయడం అనేది ఎవరికి కూడా సాధ్యం అయ్యే పని కాదు. అయితే వారి విషయంలో కొందరు ప్రవర్తిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. 

 

తెలంగాణాలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మహిళా డాక్టర్‌ పట్ల జిల్లా వైద్యాధికారి లైంగిక వేధింపులకు పాల్పడటం సంచలనంగా మారింది. బాధిత డాక్టర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసిన పోలీసులు వైద్యాధికారి గోపాల్‌రావుకు అరెస్ట్ వారెంట్ జారి చేయడం విశేషం. ఆమె చెల్పూర్ ఆస్పత్రి వైద్యురాలిగా విధులు నిర్వహిస్తున్నారని పోలీసులు చెప్పారు. ఆమెను కొన్ని రోజుల నుంచి కూడా అతను వేధిస్తున్నట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: