అంఫాన్ తుఫాన్ కారణంగా బెంగాల్ ఏ స్థాయిలో నష్టపోయింది అనే విషయం అందరికి తెలిసిందే. ఒక పక్క కరోనా వైరస్ తీవ్రత ఉన్నా సరే అక్కడి ప్రభుత్వం తుఫాన్ ని సమర్ధవంతంగా ఎదుర్కొంది అని చెప్పవచ్చు. ఇక ఇది పక్కన పెడితే బెంగాల్ లో ఇప్పుడు నష్ట నివారణా చర్యలను కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. బెంగాల్ కి కేంద్ర బృందాలు నేడు మరోసారి వెళ్లనున్నాయి. 

 

కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రెటరీ అంజు శర్మ సారథ్యంలో ఏడుగురు అధికారులతో కేంద్ర హోంశాఖ ఓ బృందాన్ని నియమించగా వాళ్ళు వెళ్తున్నారు. రోడ్లు భవనాలు, జలశక్తి, విద్యుత్ శాఖ, మత్స్య శాఖకు చెందిన ఉన్నతాధికారులు ఈ బృందంలో ఉన్నారని కేంద్రం చెప్పింది. వీరు అందరూ తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: