ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతిలో భూ కుంభకోణాలపై జగన్ సర్కార్ దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో సీఐడీ రాజధాని భూ కుంభకోణాల గురించి దర్యాప్తు జరుగుతోంది. ఏపీ సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్ మాధురిని తాజాగా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అరెస్ట్ చేసింది. విజయవాడలోని తన నివాసంలో ఆమెను అదుపులోకి తీసుకొని అధికారులు రిమాండ్ కు తరలించారు. 
 
2016 సంవత్సరంలో రాజధాని ప్రాంతంలో గోపాలకృష్ణ అనే వ్యక్తికి సంబంధించిన భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం రాయపూడి డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న మాధురి ప్రభుత్వానికి రూ. 6 కోట్లు నష్టం కలిగించినట్లు తెలుస్తోంది. అధికారులు మాధురిని కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి ఈ నెల 12 వరకు రిమాండ్ విధించారు. ఇదే కేసులో టీడీపీ నేత రావెల గోపాలకృష్ణను నెల రోజుల క్రితమే సిట్ అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతోంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: