టీడీపీ సీనియర్ నేత యరపతనేని శ్రీనివాసరావు చంద్రబాబు వయస్సు గురించి విమర్శలు చేసేవాళ్లు ఆయనతో కలిసి తిరుమల కొండ ఎక్కాలని సవాల్ విసిరారు. సీఎం జగన్ ప్రజా వ్యతిరేక విధానాలతో రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశాడని అన్నారు. ఈరోజు విజయవాడలో యరపతినేని మీడియాతో మాట్లాడుతూ జగన్ పై విమర్శలు చేశారు. జగన్ ఏడాది పాలన నేర చరిత్ర ఉన్న వ్యక్తి రాష్ట్రాన్ని పాలిస్తే ఎలా ఉంటుందో అలా ఉందని విమర్శలు చేశారు. 
 
ప్రభుత్వ నిర్ణయాలను న్యాయస్థానాలు తప్పుబడుతున్నాయని... ప్రజలు తిరగబడితే పరిస్థితులు వేరుగా ఉంటాయని హెచ్చరించారు. జగన్ కు రాష్ట్రంలో బంకర్లు ఏర్పాటు చేసుకునే పరిస్థితి త్వరలోనే వస్తుందని వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి భవిష్యత్తు నాయకులెందరో ఉన్నారని... లోకేశ్ కు దొంగసొమ్ము దోచుకోవడం, అక్రమార్జనలో అనుభవం లేదని వ్యాఖ్యలు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: