ప్రస్తుతం కరోనా వైరస్ క్లిష్ట పరిస్థితుల్లో ప్రస్తుతం చాలా మంది ప్రజలు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో... మూడు నెలల పాటు ఈఎంఐలు చెల్లించకుండా ఉండేలా మారటోరియం ప్రకటించిన విషయం తెలిసిందే. మూడు నెలల వరకు బ్యాంకులు తమ తమ ఖాతాదారుల నుంచి ఎలాంటి ఈఎంఐ  వసూలు చేయాల్సిన అవసరం లేదు అంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది 

 


 అయితే కేంద్ర ప్రభుత్వం మారటోరియం విధించినప్పటికీ... తమ ఈఎమ్ఐ లపై కొన్ని బ్యాంకులు వడ్డీ వసూలు చేస్తున్నాయి అంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై తాజాగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు... కేంద్ర ప్రభుత్వం మారటోరియం విధించి పలు ఆంక్షలను పెట్టినప్పటికీ ఖాతాదారుల నుంచి వడ్డీ వసూలు చేయడం హానికరం అంటూ వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు. కేంద్ర ప్రభుత్వం సూచించిన  నిబంధనల ప్రకారమే బ్యాంకులు నడుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ తెలిపింది. కరోనా  వైరస్ లాంటి క్లిష్టపరిస్థితుల్లో ప్రజలను వడ్డీ వసూలు చేస్తూ ఇబ్బందులకు గురి చేయడం సరైనది కాదు అంటూ వ్యాఖ్యానించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: