ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ హత్యోదంతం అమెరికాలో నెల‌కొన్న ప‌రిస్థితులు తీవ్ర‌మ‌వుతున్నాయి. రాజ‌ధాని వాషింగ్ట‌న్‌తో స‌హా అమెరికా వ్యాప్తంగా నల్ల జాతీయులు దాడుల‌కు దిగుతున్నారు. ఈ ప‌రిస్థితుల్లో ఓ సెక్స్ వ‌ర్క‌ర్ ఆందోళ‌న కారుల‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌డంతో పాటు తాను కూడా వారికి మ‌ద్ద‌తుగా రోడ్డెక్కారు. ఆమె ఆందోళ‌న కారుల‌ను పోలీసులు అరెస్టు చేయ‌డాన్ని త‌ప్పుప‌ట్టారు. పోలీసుల‌ను లంచ గొండులుగా విమ‌ర్శించిన ఆ సెక్స్ వ‌ర్క‌ర్ పోలీసుల‌కే ఓ బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించారు.  ఉద్యోగాలకు రాజీనామా చేసిన వారికి తనతో ఒక రాత్రి గడిపే అవకాశాన్ని ఇస్తానని బహిరంగంగా ప్రకటించారు. 

 

డబ్బులు తీసుకోనని, ఉచితంగా ఓ రాత్రి ఎంజాయ్ చేయవచ్చని ఆఫర్ పెట్టారు. టెక్సాస్‌కు చెందిన ఆ సెక్స్ వర్కర్ ఆందోళనకారుల నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. పోలీసులు లంచం ఇస్తే ఎలాంటి పనయినా చేస్తారనే విషయం తనకు తెలుసని, ఉద్యోగాన్ని వదిలేసే పోలీసులకు తన శరీరాన్ని లంచంగా ఇస్తానని ప్రకటించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: