దేశంలో కరోనా వైరస్ చాప కింద నీరులా విజృంభిస్తోంది. కేసుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కేంద్రం కేసులు పెరుగుతున్నప్పటికీ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా దేశవ్యాప్తంగా సడలింపులను అమలు చేస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా దేశీయ విమాన సర్వీసులు తిరుగుతుండగా సుదీర్ఘ లాక్‌డౌన్‌ అనంతరం అంతర్జాతీయ విమాన సర్వీసులు తిరిగి ప్రారంభం కానున్నాయి. 
 
కేంద్రం జులై నుంచి విదేశాలకు విమాన రాకపోకలు పునరుద్ధరించే అవకాశం ఉందని తెలుస్తోంది. విమానయాన మంత్రిత్వ శాఖ వర్గాలు ఈ మేరకు మీడియాకు తెలిపాయి. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. లాక్‌డౌన్‌తో నిలిచిపోయిన దేశీయ విమాన సర్వీసులను మే 25 నుంచి పునరుద్ధరించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుద్ధరించనున్నారని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: