ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా  వైరస్ భయం పెరిగిపోతున్న విషయం తెలిసిందే. కేవలం సామాన్య ప్రజలకే కాదు ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా కరోనా కేసులు బయట పడుతుండటం తో  అధికారులను  కూడా ఆందోళన కలిగిస్తోంది. ఏపీ సచివాలయంలో సాధారణ పరిపాలన శాఖ లో పనిచేస్తున్న వ్యక్తి  కరోనా  పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఒకటో బ్లాక్  డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పని చేస్తున్న వ్యక్తికి కరోనా  వైరస్ పాజిటివ్ అని తేలగా..  అతని రూమ్మేట్ గా ఉన్న మరో వ్యక్తికి
 కూడా కరోనా  వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. 

 


 అయితే తాజాగా సచివాలయ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం చేయాలి అంటూ  ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఇప్పటికే వ్యవసాయ శాఖకు వర్క్ ఫ్రం హోం అమలు చేసిన విషయం తెలిసిందే. తమకు  కూడా ఆ తరహాలోనే వర్క్ ఫ్రం హోం అమలు చేయాలంటూ కోరుతున్నాయి  ఉద్యోగ సంఘాలు. సచివాలయంలో  కరోనా  వైరస్ అని నిర్ధారణ కావడంతో అక్కడి ఉద్యోగులు కూడా ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రోజురోజుకు కరోనా  వైరస్ కేసులు పెరిగిపోతున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: