ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ మీరా చోప్రా కు ఎన్టీఆర్ అభిమానులకు మధ్య వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ అభిమానులు తనను అసభ్యంగా ధూషించారంటూ ఆరోపణలు చేస్తూ... ఏకంగా ఎన్టీఆర్ ని ప్రశ్నించారు మీరా చోప్రా . అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.ఈ  వ్యవహారం సోషల్ మీడియాలో చర్చనీయాంశం గా మారింది. 

 

 ఇలాంటి సమయంలో తాజాగా సీనియర్ నటి కుష్బు ఎన్టీఆర్ అభిమానులకు అండగా నిలిచింది. మీరా చోప్రా కి ఇండైరెక్టుగా కౌంటర్ ఇచ్చింది.  అయితే జూనియర్ ఎన్టీఆర్ కి  సీనియర్ నటి కుష్బూ వీరాభిమాని అన్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ఫోటో కనిపిస్తే చాలు పూనకం వచ్చినట్లుగా మారిపోతుంది కుష్బూ. తాజాగా సోషల్ మీడియా వేదికగా మీరా ప్రవర్తనను తప్పుబట్టింది. కొంతమంది ఆడవాళ్ళు ఎప్పటికీ మారరు... లేదా ఏమీ నేర్చుకోరు వాళ్ళని అలాగే ఉండనివ్వండి అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టింది కుష్బూ . ఈ పోస్టులో  మీరాచోప్రా పేరు వాడకపోయినా ఇప్పటికీ ఆమె ను ఉద్దేశించి కుష్బూ ఈ పోస్ట్   పెట్టింది అని అందరూ అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: