తెలంగాణ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య, కరోనా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రంలో వైద్య సిబ్బంది కరోనా భారీన పడటంపై హైకోర్టు సీరియస్ అయింది. కరోనా వ్యాప్తి, టెస్టులకు సంబంధించి దాఖలైన పిటిషన్ పై హైకోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. డాక్టర్లకు పీపీఈ కిట్లు ఇవ్వలేదా...? అంటూ తెలంగాణ సర్కార్ ను ప్రశ్నించింది. పీపీఈ కిట్లు ఇస్తే వైరస్ ఎలా సోకిందో చెప్పాలంటూ ఆగ్రహం వ్యకం చేసింది. 
 
ఈ నెల 8లోగా వైద్య సిబ్బందికి కరోనా సోకడం గురించి సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో 34 మంది వైద్య సిబ్బందితో పాటు జూనియర్ డాక్టర్లు కూడా కరోనా భారీన పడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని పిటిషనర్ పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు ఆ పిటిషన్ ను విచారణకు స్వీకరించి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: