ప్రపంచంలో కరోనా వైరస్ ఎప్పటి నుంచి ప్రబలిపోవడం మొదలైంది.. దాని ప్రభావం చైనా తర్వాత ఎక్కువగా అమెరికా, బ్రిటన్, ఇటలీ, ఫ్రాన్స్ దేశాలకు చూపించింది.  అయితే ప్రపంచంలో మూడో వంతు కేసులు, మరణాలు ఒక్క అమెరికాలోనే చోటు చేసుకున్నాయి. ఇప్పుడు రష్యాలోకూడా మరణాలు, కేసుల సంఖ్య పెరిగిపోతుంది.  ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 65 లక్షల 67 వేల 404 మంది కరోనా వైరస్‌ పాజిటివ్‌ భారిన పడ్డారు. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 30 లక్షల 10 వేల 562. వ్యాధి నుంచి 31 లక్షల 68 వేల మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు.  ఇప్పుడు మెక్సికో, బ్రెజిల్‌లో గడిచిన 24 గంటల్లో రికార్డుస్థాయిలో కోవిడ్‌-19 మరణాలు సంభవించాయి.

 

మెక్సికోలో గడిచిన 24 గంటల్లో వెయ్యి మందికి పైగా మరణించడం ఇదే మొదటిసారి. వ్యాధి కారణంగా మెక్సికోలో నిన్న 1,092 మంది చనిపోయారు. అంతకుక్రితం రోజు మరణాల సంఖ్య 470గా ఉంది. బ్రెజిల్‌లో సైతం గడిచిన 24 గంటల్లో రికార్డుస్థాయిలో ఒక్కరోజే 1,349 మంది చనిపోయారు. కోవిడ్‌-19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా మరణాలు సంభవించిన దేశాల వివరాలిలా ఉన్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: