కేరళ రాష్ట్రం లో నిన్న జరిగిన ఏనుగు  హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పైనాపిల్ లో దీపావళి బాంబులు పెట్టి ఏనుగుకు  ఇవ్వడంతో అది తిన్న ఏనుగు  ఏకంగా ఒక్కసారిగా దీపావళి పటాక్ కాయలు పేలడంతో తీవ్రంగా గాయపడిన సంఘటన దేశవ్యాప్తంగా అందరినీ కలిచి  వేసిన విషయం తెలిసిందే. మనుషుల్లో మానవత్వం కరువైపోయింది అనడానికి ఈ ఘటన నిదర్శనం గా మారిపోయింది. ఇక ఈ ఘటన పై చర్యలు తీసుకునేందుకు అటు ప్రభుత్వాలు కూడా సిద్ధం అయిన విషయం తెలిసిందే. 

 

 అయితే మనుషుల్లో మానవత్వం కరువైనప్పటికీ జంతువుల్లో మాత్రం ఇంకా మానవత్వం మిగిలి ఉంది అనేందుకు ఇక్కడ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. తాజాగా ఒక నెటిజన్ ఏనుగుకు  సంబంధించిన ఒక వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఓ వ్యక్తి నదిలో ఈదుతూ  వెళ్తుండగా పక్కనే ఉన్న ఒక చిన్న ఏనుగు సదరు వ్యక్తి నీటిలో కొట్టుకుపోతున్నాడేమో అని భావించి వెంటనే నది  ప్రవాహంలోకి దిగింది. తన ప్రాణాలు పోయినా పర్వాలేదు అనుకుందో ఏమో... వెంటనే ఈదుకుంటూ వచ్చ సదరు వ్యక్తిని ఒడ్డుకు  చేర్చేందుకు ప్రయత్నించింది . ఈ వీడియో ప్రస్తుతం మనుషుల్లో అంటే ఏనుగు లోనే ఎక్కువ మానవత్వం ఉంది అని నిరూపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: