కేరళలోని మలప్పురంలో మే 27న ఆకతాయిల కారణంగా ఏనుగు ప్రాణాలు వదిలిన విషయం తెలిసిందే.  దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఏ ఏనుగు మరణం అందరి హృదయాలను కలిచి వేసింది.  మేం మనుషుల మద్య ఉన్నామా? కృర మృగాల మద్య ఉన్నామా? అవి కూడా ఇంత ఘోరంగా హింసించి చంపవు అన్నట్టు ఆ ఏనుగు ఎంతో బాధపడి ఉంటుందో అని నెటిజన్లు కన్నీరు పెట్టుకుంటున్నారు.  ఈ నేపథ్యంలో రాజకీయ, క్రీడా, సినీ, వ్యాపార రంగాలకు చెందిన వారి నుంచి సామాన్యుల వరకు సోషల్ మాద్యమ్యాలో దుమ్మెత్తి పోస్తున్నారు.. ఆ కృరమృగాలకు కఠిన శిక్ష విధించాలని కోరుతున్నారు.  మరోవైపు నిందితులను పట్టుకోడానికి కేరళ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. 

IHG

నిందితుల ఆచూకీ చెప్పిన వారికి హైదరాబాద్ వాసి ఒకరు భారీ ఆఫర్ ప్రకటించారు. వారిని పట్టిస్తే రూ. 2 లక్షల నగదు రివార్డు ఇస్తారని నేరేడ్‌మెట్ కు చెందిన శ్రీనివాస్ ప్రకటించారు. దేవి నగర్‌లో నివసించే ఆయన .. ఏనుగు వధపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.  స్వతహాగా  జంతుప్రేమికుడైన శ్రీనివాస్ లాక్‌డౌన్ సమయంలో ఆహారం లేక అలమటించి వీధి కుక్కలకు, ఆవులకు తిండి పెట్టారు. తన సొంత గ్యారేజ్‌లో ఆహారం వండించి నగర వ్యాప్తంగా పంపిణీ చేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: