జల సౌధలో కృష్ణా యాజమాన్య బోర్డ్ మీటింగ్ ముగిసింది. తెలంగాణా ప్రాజెక్ట్ లపై ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం తెలిపింది. ఇరు రాష్ట్రాల ప్రాజెక్ట్ లపై సుదీర్గంగా వాదనలు జరిగాయి. అయితే వాటి అన్నింటికి ఉమ్మడి రాష్ట్ర హయాంలోనే అనుమతులు వచ్చాయని చెప్పింది తెలంగాణా. పోతిరెడ్డి పాడు సామర్ధ్యం పెంపు నిర్ణయంపై తెలంగాణా అభ్యంతరం వ్యక్తం చేసింది. 

 

తెలంగాణా ప్రాజెక్ట్ లకు వచ్చిన అనుమతులను జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ చూపించారు. డీపీఆర్ టెలిమెట్రీ నీటి కేటాయింపులపై ఎక్కువగా చర్చ జరిగింది. ఈ సమావేశం మొత్తం కూడా వాడీ వేడిగా జరిగింది. పోతిరెడ్డిపాడు వద్ద రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలంగాణా ఈ సందర్భంగా స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: