దేశం మొత్తం కరోనా మహమ్మారితో పోరాటం చేస్తుంది.  సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఈ కరోనాతో సతమతమవుతున్నారు.  మార్చి 24 నుంచి లాక్ డౌన్ మొదలు పెట్టినప్పటి నుంచి ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. పనులు లేక ఎంతో మంది ఇంటికే పరిమితం అయ్యారు.  కేంద్రం ఆర్థికంగా పేదలను ఆదుకుంటున్నారు. కరోనా వల్ల వలస కార్మికుల ఎన్నో కష్టాలు వచ్చి పడ్డాయి.  అన్ని వ్యాపార రంగాలు కుటుంపడ్డాయి.. మొత్తనికి రెండు నెలలు డబ్బులు లేక.. ఉన్న డబ్బులను ఎలా మెయింటేన్ చేయాలో తెలియక సామాన్యులు కష్టాలు పడ్డారు. ఇలాంటి కరోనా కష్ట కాలంలో కారులో రూ. 2 కోట్ల రూపాయలు తరలిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో పోలీసులు భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు.

 

అక్కడ భారీ ఎత్తున నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతమైన గడ్చిరోలి జిల్లా సిరొంచ ప్రాంతంలో వాహనాలు నిలిపేసిన పోలీసులు ఓ కారులో రూ.1.20 కోట్లు గుర్తించారు. మరో కారులో రూ.99.30 లక్షలు గుర్తించి..మొత్తం నగదును సీజ్‌ చేశారు. అయితే ఆ నగదుకు సంబంధించిన ఎలాంటి ధ్రువ పత్రాలు చూపకపోవడంతో..నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని..యూఏపీఏ చట్టం కింద కేసు నమోదు చేశాం. వాహనాలు సీజ్‌ చేశాం. భారీ మొత్తంలో నగదు ఎక్కడి నుంచి తరలిస్తున్నారనే విషయంపై నలుగురిని విచారిస్తున్నామని సిరొంచ డీఎస్పీ ప్రశాంత్‌ స్వామి తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: