దేశంలో కరోనా మహమ్మారి తో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.  అయితే రెండు నెలల వరకు లాక్ డౌన్ తో రావాణ వ్యవస్థ అస్థ వ్యవస్థగా మారిపోయింది. దాంతో ఆటోలు పూర్తిగా బంద్ అయ్యాయి. ఈ మద్య ఆటోలు నడిపేందుకు పరిమిషన్ ఇచ్చారు.  అయితే ఆటోలు నడుస్తున్నా.. జనాలు మాత్రం అందులో ప్రయాణానికి సిద్దంగా లేరు. లాక్ డౌన్ కారణంగా ఎందరో ప్రజలు ఉపాధి కోల్పోయారు. ఇక  ఆటో డ్రైవర్ల పరిస్థితి మాత్రం మారలేదు. కరోనాకు ముందులా ప్రయాణికులను తీసుకెళ్లే వెసులుబాటు లేకుండా పోయింది. దీంతో అది వారి ఆదాయం తగ్గుముఖం పట్టింది. ఈ సమయంలో ఆటోలు నడిపే వారు ఇతర పనులు చూసుకుంటున్నారు.  కార్మికులుగా మారుతున్నారు కొంత మంది. కొంత మంది కూరగాయలు, పండ్లు అమ్ముతున్నారు.

 

అయితే ఓ ఆటో కార్మికుడు మాత్రం తన తెలివితో అందరిని ఆకర్షిస్తున్నాడు. ఆదాయాన్ని పెంచుకోవడానికి తమిళనాడులోని కోయంబత్తూర్‌కి చెందిన అబ్దుల్‌ సమద్ అనే ఆటోడ్రైవర్‌ వినూత్న ప్రయోగం చేశాడు. తన ఆటో వెనుక భాగంలో చిన్న దుకాణాన్ని పెట్టాడు. అందులో సిగరెట్లు, వాటర్‌ బాటిల్స్‌, బిస్కెట్లను అమ్మడం మొదలు పెట్టాడు. అయితే ఆటో నడిపినంత వరకు ఆ ఆదాయం ఉంటుంది.. ఒక వేళ ఆటో నడవని పరిస్థితిలో దాన్ని పక్కన ఆపి ఆటో షాప్ ద్వారా రోజుకి అదనంగా రూ.200 నుంచి రూ.250 వరకు సంపాదిస్తున్నానని వెల్లడించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: