నెల్లూరు జిల్లా ప్రభుత్వ అధికారులపై వైసీపి ఎమ్మెల్యే  ఆనం రామనారాయణ రెడ్డి మరోసారి తన అసంతృప్తిని వ్యక్తం చేసారు. నెల్లూరు జిల్లా నీటి పారుదల శాఖ  అధికారులు నీళ్లను అమ్ముకుంటున్నారని ఆయన దుయ్యబట్టారు. గతం లో ఏపీ సీఎం స్వర్ణముఖి లింక్ కెనాల్‌ను పరిశిలించ వలసింది గా సూచించారు. కానీ అధికారులు అది ఏమి పట్టనట్లుగా ఉంటున్నారని ఆనం మండి పడ్డారు.

 

 

 

జిల్లా అధికారులు ఉన్నది టిఫిన్లు , కాఫీలు మోయడానికా ? వెంకటగిరినియోజక వర్గాన్ని మరచి పోయారా ? అంటూ ఆయన  నిప్పులు చెరిగారు . రావూరిలోని గిరిజన బాలికల గురుకుల వసతి గృహం కోసం ఐదు ఎకరాలు అవసరం ఉందని, ఆ ఐదు ఎకరాల భూమి కోసం ప్రిన్సిపాల్ ఇంకా వెతుకుతూనే ఉన్నారని ఈ సందర్భం గా తెలిపారు. గిరిజన గురుకుల భవన నిర్మాణం గురించి ఐటీడీఏ పీఓ పట్టించుకోవడంలేదని విమర్శించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: