పెద్ద పులి సంచారం తో సింగరేణి కార్మికులు బయన్దోలనకు గురైన ఘటన శ్రీరామ్ పూర్ ఏరియా లో చోటుచేసుకుంది. శ్రీరామ్ పూర్ ఏరియా ఆర్కె 8 వ గని వద్ద పెద్దపులి సంచరిందింది. గని పెద్ద గేట్ మరియు మ్యాగజిన్ ల వద్ద సింగరేణి ఏఅండ్ సిసి కె సతీష్ కుమార్ మరియు జి సత్యనారాయణ విధులు నిర్వహిస్తూవుండగా ఆర్కే 8వ గని  పరిసరప్రాంతాలలో అటవీ ప్రాంతం నుండి వచ్చి పెద్దపులి మెయిన్ గేట్ సమీప మ్యాగజిన్ వద్ద గల మడుగులో నీరు తాగడానికి వచ్చింది.

 

ఇది గమనించిన పనివారు మరియు అధికారులు పరుగులు తీశారు. నీరు తాగి పెద్దపులి తిరిగి అక్కడనుండి వెళ్లిపోవడంతో డిప్యూటీ ఎఫ్‌ఆర్వోలు సంతోశ్‌కుమార్‌, సాగరిక, సునీత అటవీ సిబ్బంది అక్కడి చేరుకొని పులి అడుగులను గుర్తించారు. ఆ తరువాత ఎనిమల్‌ ఫారెస్ట్‌ ట్రాకర్‌ ఎల్లం ఆధ్వర్యంలో ఆర్‌కే 8గని ఆవరణలో, అటవీ ప్రాంతంలో  పులి సంచరించినట్లు రికార్డు చేశారు. పెద్దపులు అడుగులను ఫొటో తీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: