గత కొద్దిరోజులుగా మిడతల దండు గురించిన వార్త ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. తాజాగా జరిగిన సంఘటన ఆ విషయాన్నే రూడీ చేస్తోంది. అయితే బుధవారం మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం లోని నాయకన్ పేట గ్రామ శివారు ప్రాంతంలో మిడతల దండు కలకలం సృష్టించాయి. గ్రామ ప్రజలు భయాందోళనకు గురి కాగా వాటిని  బెల్లంపల్లి కృషి విజ్ఙాన కేంద్రం వద్దకు తీసుకుపోగా  బెల్లంపల్లి కృషి విజ్ఙాన కేంద్రం శాస్త్రవేత్తలు తిరుపతి, నాగరాజు వాటిని పరిశీలించారు.

 


వాటిపై పరీక్షలు జరిపిన తరువాత ఇవి ఏమీ ప్రమాదకరమైన మిడతలు కావు అని వెల్లడించారు. ఇవి సహజం గానే పొలాల్లో గడ్డి పై వాలే సహజమైన మిడతలు ..కావున వీటినిగురించి భయాందోళనకు గురికావద్దని వారు చెప్పడంతో గ్రామ  ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. వీటిని పరీక్ష చేస్తుండగా భీమిని ఏడీఏ ఇంతియాజ్‌, కన్నెపల్లి ఏవో శ్రీకాంత్‌, ఎస్‌ఐ ప్రశాంత్‌ రెడ్డి, సర్పంచ్‌ హంస అక్కడ ఉన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: