ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి తరచుగా హై కోర్ట్ నుండి ఎదురుదెబ్బలు తలుతూనే ఉన్నాయ్. తాజాగా ఈ విషయమై ఏపీ హైకోర్టులో స్పషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో ఏర్పాటు పై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్బంగా ఏపీ సీఎస్, స్పెషల్ సీఎస్, డీజీపీ తో సహా ఆరుగురు అధికారులకు నోటీసులు జారీ చేసింది.  ఏ నిబంధనల ప్రకారం ఎస్‍ఈబీ ఏర్పాటు చేశారో తెలపాలని నోటీసులు ఇచ్చింది.

 

అయితే ఏపీలో మద్యపాన నియంత్రణ లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం SEB ఏర్పాటు చేసింది. అయితే ఈ విషయమై ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి పిల్ దాఖలు చేశాడు. SEB కి చట్టబద్దత లేదని అందువల్ల SEB పెట్టె కేసులు న్యాయపరంగా చెల్లవని వాదిస్తూ ఈయన కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. ఈ వాదననుఁ పరిశీలించిన  హైకోర్టు ఆరుగురు ఉన్నతాధికారుల ధర్మాసనం మరో రెండు వారలు ఈ కేసును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: