భార‌త‌దేశంలో గత ఎనిమిదేండ్లలో 750 పులులు వివిధ కారణాలతో మృతి చెందాయి. మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రల్లో అత్యధికంగా మరణించాయని ఓ ఆర్టీఐ పిటిషన్‌కు జాతీయ పులుల సంరక్షణ సంస్థ (ఎన్టీసీఏ) తెలిపింది. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో 28, అసోంలో 17. ఉత్తరాఖండ్‌లో 14, ఉత్తరప్రదేశ్‌లో 12, తమిళనాడులో 11, కేరళలో 6, రాజస్థాన్‌లో మూడు పెద్ద పులులు వేటగాళ్ల ఉచ్చుల‌కు బలయ్యాయి.

 

మిగతావి వివిధ కారణాలతో మరణించాయి. అంటే ఈ ఎనిమిదేళ‌ల్లో ఏడాదికి సుమారు వంద పులులు మ‌ర‌ణించిన‌ట్లు తెలుస్తోంది. దీనిపై జంతు ప్రేమికులు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వాలు పులుల సంర‌క్ష‌ణ‌కు క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: