దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ చాప కింద నీరులా వ్యాప్తి చెందుతోంది. వలస కార్మికుల రాకతో తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 127 కరోనా కేసులు నమోదయ్యాయి. గత కొంతకాలంగా కేసులు నమోదు కాని అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లో తాజాగా తొమ్మిది కరోనా కేసులు నమోదయ్యాయి. ముంబాయి నుంచి రాష్ట్రానికి వచ్చిన వలస కూలీలకు కరోనా నిర్ధారణ అయింది. 
 
43 రోజుల తర్వాత కొత్త కేసులు నమోదు కావడంతో మండలంలోని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గతంలో మర్కజ్ ప్రార్థనల వల్ల 21 మందికి కరోనా సోకగా తాజాగా 9 కేసులు నమోదయ్యాయి. వైద్య సిబ్బంది వీరిని ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలించారు. తొమ్మిది కేసులు నమోదు కావడంతో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. పాజిటివ్ వచ్చిన వారితో సన్నిహితంగా ఉన్నవారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: