దేశంలో కరోనా రోజురోజుకు విజృంభిస్తూ ఉండటంతో కేంద్రం మార్చి నెల 25న లాక్ డౌన్ ప్రకటించింది. లాక్ డౌన్ పలు కంపెనీలపై ప్రత్యక్షంగా మరికొన్ని కంపెనీలపై పరోక్షంగా తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రముఖ సైకిళ్ల తయారీ సంస్థ అట్లాస్ తాత్కాలికంగా లేఆఫ్ ప్రకటించింది. అంతర్జాతీయ సైకిల్ దినోత్సవం రోజునే ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సహిబాబాద్ ప్రాంతంలో ఉన్న అట్లాస్ సైకిళ్ల తయారీ కర్మాగారంలో ఉద్యోగాలకు కంపెనీ తాత్కాలికంగా లే ఆఫ్ ప్రకటించింది. 
 
సహిబాబాద్ ప్లాంటులో నెలకు రెండు లక్షల సైకిళ్ల ఉత్పత్తి జరుగుతుంది. వారం రోజుల క్రితం సంస్థ ఉద్యోగులను విధులకు రావాలని కోరింది. కానీ అంతలోనే లేఆఫ్ ప్రకటించి ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. అట్లాస్ సైకిల్ ప్లాంట్ వర్కర్స్ యూనియన్ నాయకుడు మహేష్ కుమార్ లేఆఫ్ వల్ల కార్మికులు రోడ్డున పడ్డారని వ్యాఖ్యలు చేశారు. అట్లాస్ సైకిల్ ప్లాంట్ మూసివేత నిర్ణయంపై కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: