ఉద్యోగాల పేరుతో నిత్యం ఏదో ఒక‌చోట మోసాలు జ‌రుగుతూనే ఉన్నాయి. ల‌క్ష‌ల్లో బాధితులు కోల్పోతున్నారు. తాజాగా.. హైదరాబాద్ మ‌హాన‌గ‌రంలో కూడా మ‌రో మోసం వెలుగుచూసింది. నగరానికి చెందిన ఓ యువకుడు ఉద్యోగం కోసం రెజ్యూమ్‌ను జాబ్‌పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయగా..  సైబర్‌ నేరగాళ్లు మంచి ఉద్యోగం ఇప్పిస్తామంటూ నిమ్మించి.. అతడికి రూ.1.67లక్షలు టోకరా వేశారు. సికింద్రాబాద్‌కు చెందిన రాజేశ్‌ ఉద్యోగం కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో తన రెజ్యూమ్‌ను ఓ జాబ్‌పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేశాడు.

 

దీన్ని గమనించిన గుర్తు తెలి యని వ్యక్తులు రాజేశ్‌కు  ఫోన్‌చేసి.. మీ అర్హతకు మంచి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించారు. అయితే ముందుగా రిజిస్ట్రేషన్‌ కోసం రూ.2వేలు చెల్లించాలని  సూచించగా ఆ డబ్బులు చెల్లించాడు.  ఆ తరువాత ఇంటర్వ్యూ, కాల్‌ సెంటర్‌, సెక్యూరిటీ డిపాజిట్‌, ఇలా పలు రకాల కారణాలు చెబుతూ.. ఏకంగా అత‌ని నుంచి రూ. 1.67 లక్షలు లాగేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: