సాధారణంగా బైక్ పై వెనుక సీట్లో ప్రయాణించే సమయంలో ఆడవాళ్లు హెల్మెట్ తమకెందుకని భావిస్తూ ఉంటారు. ఐతే ద్విచక్రవాహనాల ప్రమాదాల్లో వెనకాల కూర్చొని హెల్మెట్‌ లేకపోవడంతో ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ట్రాఫిక్ పోలీసులు వెనక కూర్చున్న వారు కూడా తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని చెబుతున్నా కొందరు పట్టించుకోకపోవడంతో ప్రాణాలు కోల్పోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గడచిన 48 గంటల్లో నలుగురు మహిళలు రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారు. 
 
మృతి చెందినవారంతా హెల్మెట్‌ లేకుండా బైక్‌ వెనకాల కూర్చున్నవారే కావడం గమనార్హం. పేట్‌బషీరాబాద్‌, మేడ్చల్‌, బాచుపల్లి ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్రవాహనాల వెనకాల కూర్చున్న నలుగురు మహిళలు హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల మరణించారు. నాలుగు ప్రమాదాల్లో.. రెండు ఘటనల్లో వెనకాల నుంచి వచ్చిన వాహనాలు ఢీకొట్టడంతో అదుపుతప్పి కిందపడి తలకు తీవ్రగాయాలై ఇద్దరు మృతి చెందగా మరో ఘటనలో అకస్మాత్తుగా బ్రేక్‌ వేయడంతో వాహనం అదుపుతప్పి మహిళ కిందపడి మృతి చెందింది. ప్రమాదంలో ముందు వెళుతున్న భారీ వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేయబోయి బైక్ అదుపు తప్పటంతో మరో ప్రమాదం చోటు చేసుకుంది. హెల్మెట్ ధరించి ఉంటే మహిళలు బ్రతికే అవకాశం ఉండేదని పోలీసులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: