మహారాష్ట్ర రాజధాని ముంబై లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అక్కడి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా సరే పెద్దగా ఫలితం మాత్రం కనపడటం లేదు. కరోనా కట్టడికి కీలకమైన పరీక్షలను చేయడం అక్కడి ప్రభుత్వ౦ విఫలం అవుతుంది అనే ఆరోపణలు వినపడుతున్నాయి. దేశంలో నమోదు అవుతున్న 20 శాతం కేసుల్లో అక్కడే 20 శాతం నమోదు అవుతున్నాయి. 

 

కేసుల సంఖ్య క్రమంగా పెరిగినప్పటికీ, నగరం ప్రతిరోజూ 4,000 మరియు 4,200 మధ్య మాత్రమే పరిక్షలు చేస్తున్నారు. ముంబైలో ప్రతిరోజూ సుమారు 10,000 పరీక్షలు చేయగల సామర్థ్యం ఉందని చెప్తున్నారు. ఇక ఇదే విషయాన్నీ ఆ రాష్ట్ర మాజీ సిఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా రాసిన లేఖలో చెప్పారు. ముంబై, పూణే కలిసి మహారాష్ట్ర కేసులలో 70శాతం ఉన్న సరే పరిక్షలు మాత్రం చేయడం లేదు అక్కడి ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి: