వందే భారత్ మిషన్ ద్వారా రెండు దశల్లో ప్రపంచవ్యాప్తంగా 58,867 మంది భారతీయులను విజయవంతంగా తీసుకొచ్చిన భారత ప్రభుత్వం మూడో దశకు ఇప్పుడు సిద్దమైంది. ఎయిర్ ఇండియా జూన్ 5 న సాయంత్రం 5 గంటల నుండి ఏడు గమ్యస్థానాల బుకింగ్లను ప్రారంభించింది. యునైటెడ్ స్టేట్స్ మరియు కెనడా నుండి భారతీయులను తరలించడానికి ఎయిర్ ఇండియా విమానాలను నడుపుతుంది. కింది స్థలాల బుకింగ్ శుక్రవారం ప్రారంభమవుతుంది:


న్యూయార్క్


నెవార్క్


వాషింగ్టన్


చికాగో

 

శాన్ ఫ్రాన్సిస్కొ


టొరంటో


వాంకోవర్

మే 7 మరియు జూన్ 1 మధ్య, ఎయిర్ ఇండియా గ్రూప్ మొత్తం 423 విమానాలను నడిపిన సంగతి తెలిసిందే. యుఎఇ, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, బహ్రెయిన్, మాల్దీవులు, సింగపూర్, మరియు యుఎస్ సహా 11 దేశాల నుండి భారతీయులను తిరిగి తీసుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: