దేశ వ్యాప్తంగా ఈ నెల 8 నుంచి దేవాలయాలను తిరిగి తెరుస్తున్న నేపధ్యంలో ఇప్పుడు అధికారులు జాగ్రత్త చర్యలను తీసుకుంటున్నారు. దాదాపు దేశంలో ఉన్న అన్ని దేవాలయాల్లో కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు... శానిటేషన్ చేస్తున్నాయి. పూర్తిగా శానిటేషన్ వర్క్ ని చేసి భక్తులను అనుమతించాలి అని నిర్ణయం తీసుకున్నారు. 

 

ఇక విగ్రహాలకు బారికేడ్లకు మనుషుల చేతులు తగలవద్దు అని చెప్తున్నారు. భక్తులు ఆరు అడుగుల దూరం కచ్చితంగా పాటించాలి అనేది కేంద్రం చెప్తున్న మాట. ప్రస్తుతం ఉత్తరాదిలో ఉన్న అన్ని దేవాలయాల్లో కూడా శానిటేషన్ వర్క్ పూర్తి అయినట్టు తెలుస్తుంది. ఇక పూజారులకు కూడా కనీస జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచనలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: