దేశ వ్యాప్తంగా కరోనా కేసులు ఏ మాత్రం కూడా ఆగడం లేదు. నేడు ఏకంగా దాదాపు పది వేల కేసులు నమోదు అయ్యాయి. వేల కేసులు నమోదు కావడంతో అటు కేంద్రం కూడా ఇప్పుడు కరోనా వైరస్ ని ఏ విధంగా కట్టడి చెయ్యాలో అర్ధం కాని పరిస్థితిలో ఉంది అనే విషయం చెప్పవచ్చు. 

 

ఇక దేశంలో కరోనా పరిక్షల సంఖ్యను కూడా కేంద్రం పెంచుతుంది. ఇప్పటివరకు మొత్తం 43,86,376 నమూనాలను పరీక్షించారు, వీటిలో 1,43,661 నమూనాలను గత 24 గంటల్లో పరీక్షించారని ఐసిఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) ఒక ప్రకటనలో తెలిపింది. కాగా దేశంలో కరోనా కేసులు 2 లక్షల 26 వేలు దాటాయి. మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా కేసులు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: